శ్రీశక్తి భవానీ అసోసియేషన్, సాయి నగర్ వేములవాడ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి భాగవతారిని నాగరాణి హైదరాబాద్, అమ్మవారి చరిత్ర, హరికథను వినిపించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి సేవలో పాల్గొని, కనకదుర్గ అమ్మవారి చరిత్రతో పాటు హరికథను శ్రద్ధగా విన్నారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.