భీమన్న గుడిలో కార్తీక దీపోత్సవం (వీడియో)

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయం భీమన్న గుడిలో మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాంప్రదాయ దుస్తుల్లో సుహాసినిలు కనువిందు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్