హైదరాబాద్‌లోని శ్రీ పరాశర వైదిక ఆగమ శాస్త్రవేడ పరిషత్ అభ్యర్థన మేరకు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వులతో, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పవిత్ర వారణాశి క్షేత్రంలో నవంబరు 1, 2025న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. వేదమంత్రోచ్చారణలు, సాంప్రదాయ సంగీతంతో భక్తులు పరవశించారు. ఈ మహోత్సవం వేములవాడ ఆలయ ప్రతిష్ఠను, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి రమాదేవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బ్రహ్మన్న శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీ ఉన్నారం భాస్కర్, స్థానాచారి ఇన్‌చార్జ్ శ్రీ నమిలికొండ ఉమేష్, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు పాల్గొన్నారు.