వేములవాడ: ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుళ్ళు

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి గుడిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో స్వామివార్లను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో ఆలయం సందడిగా మారింది. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పల్లకి సేవపై అంతరాలయంలో దేవదేవుళ్ళు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. హరిహర క్షేత్రం హరిహరుల నామస్మరణతో మారుమోగుతోంది.

సంబంధిత పోస్ట్