రైస్ మిల్లులో ధాన్యం వెంటనే అన్ లోడ్ చేయాలి

రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, రైస్ మిల్లుల్లో ధాన్యం అన్ లోడ్ చేయాలని ఆదేశించారు. కోనరావుపేట మండలం మల్కపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు అన్ని వసతులు కల్పించి, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. అలాగే, కొండాపూర్ గ్రామ శివారులో వర్షానికి దెబ్బతిన్న లో లెవెల్ కల్వర్టుకు పక్కాగా మరమ్మత్తులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్