అమరుల త్యాగం అజరామరం: ఎస్పీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, జిల్లా కేంద్రంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్పించిన వారి త్యాగాలను ప్రజలు మరువరాదని, వారి ఫలితమే నేడు ప్రశాంత వాతావరణం నెలకొందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, సైకిల్ ర్యాలీ, 2కె రన్, వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీ, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్