రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల్లో చేప పిల్లల విడుదల పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో, ఈ నెల 20వ తేదీ నాటికి నిర్దేశిత లక్ష్యం మేరకు చేప, రొయ్య పిల్లల విడుదల పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, టీ-మత్స్య యాప్‌లో చేప పిల్లలు, సరఫరాదారులు, వాహనాల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు.