TG: ప్రమాదవశాత్తు అక్కాచెల్లెళ్లు చెరువు కుంటలో పడి దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో సోమవారం చోటు చేసుకుంది. రోడ్లపై చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే శివాని(23), మల్లవ్వ(19) బట్టలు ఉతకడానికి సింగరాయకుంటలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకరిని కాపాడబోయి మరొకరు చెరువులో పడిపోయారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.