రోజులో అత్యవసరమైన భోజనం బ్రేక్‌ఫాస్ట్. అయితే బరువు తగ్గాలన్న ఉద్దేశంతో లేదా రాత్రి ఎక్కువ తిన్నామన్న భావనతో చాలామంది టిఫిన్ మానేస్తుంటారు. ఇలా చేస్తే మెదడుకు తగిన ఎనర్జీ దొరకదు. ఏకాగ్రత తగ్గుతుంది. బ్లోటింగ్, అజీర్తి, గుండె సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. టిఫిన్ ఆలస్యం చేసినా ఆయుష్షుపై ప్రభావం ఉంటుంది. మాంచెస్టర్ యూనివర్శిటీ స్టడీ ప్రకారం, ఆలస్యంగా చేసే బ్రేక్‌ఫాస్ట్ వల్ల ఆయుష్షు 8-10 శాతం తగ్గే ప్రమాదం ఉంది.