టీ తాగుతూ సిగరెట్ తాగితే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం వరకు పెరుగుతాయి. టీలో ఉండే టాక్సిన్స్ సిగరెట్ పొగలో కలిస్తే అది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల సంతాన లేమి సమస్యలు, కడుపులో పుండ్లు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తులు కుంచించుకుపోవడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.