ఫ్యాన్సీ స్టోర్‌లో పాము.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు (వీడియో)

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులోని ఓ ఫ్యాన్సీ స్టోర్‌లో పాము కలకలం రేపింది. వినియోగదారు గాజులు అడగగా, షాపు యజమాని వాటిని తీస్తున్న క్రమంలో భారీ పాము కనిపించింది. దీంతో ఫ్యాన్సీ స్టోర్‌ యజమానితోపాటు వినియోగదారులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ఉయ్యూరు జయప్రకాశ్‌ ఆరు అడుగుల పొడవున్న పామును పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్