TG: రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు నిర్వహించడానికి సెర్ఫ్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు త్వరలో తనిఖీలు చేపట్టనుంది. ఈ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించింది. స్థానిక పంచాయతీ కార్యదర్శులు, మండల పింఛన్ ఇన్ఛార్జులకు సూచనలు ఇవ్వాలని, పెన్షన్ల పంపిణీ, చెల్లింపులో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది.