TG: భార్యతో కలహాలు, దూరంగా జీవించడం వల్ల మనస్తాపానికి గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లో నివసిస్తున్న తోట శ్రవణ్ (32) ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు. భార్యతో తరచూ గొడవల కారణంగా ఆమె ఆరు నెలలుగా వేరుగా ఉంటోంది. దీనితో మానసిక వేదనకు గురైన శ్రవణ్ బుధవారం ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.