కాశ్మీర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా గడూల్‌లో జరిగిన యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన ఇద్దరు పారా కమాండోలు అదృశ్యమయ్యారు. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా వారితో కమ్యూనికేషన్ కోల్పోయింది. హెలికాప్టర్లు, స్థానికుల సహకారం మరియు స్పెషల్ టీమ్స్‌తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.