TG: తమ పిల్లలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుకున్నామని కొంత మంది నేతలు, సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు. కష్టపడి.. పస్తులుండి.. అప్పులు చేసి పిల్లలను చదివించాం.ఆరోపణలు తిప్పికొట్టకపోతే నిజంగానే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం' అని మీడియా సమక్షంలో మాట్లాడారు.