కన్న తండ్రిని గుండెలపై గుద్ది చంపిన కొడుకు!

AP: విజయనగరం (D), బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. పెదమజ్జి నాయుడు(72), ఆయన కొడుకు గణేష్‌ ఉంటున్నాడు. అయితే వీరి మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి. ఆస్తి కోసం కొడుకు తండ్రి కాలు విరగొట్టాడు. దీంతో చికిత్స కోసం తండ్రి భూమిని అమ్మకానికి పెట్టాడు. అయితే తండ్రి అడ్డు తప్పిస్తేనే భూమి దక్కుతుందని కొడుకు గణేష్ అనుకున్నాడు. ఈ క్రమంలోనే గణేష్ అర్ధరాత్రి సమయంలో గునపంపై తండ్రి గుండెలపై గుద్ది గుద్ది దారుణంగా చంపాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్