హిందీలో కొత్త సిరీస్‌లు:
యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న 'రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్'తో పాటు రవీనా టాండన్, రోనిత్ రాయ్ నటించిన 'డైనస్టీ', వివాదాస్పద వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'స్కామ్ 2010', హుమా ఖురేషి నటించిన 'మహారాణి 4' వంటి సిరీస్‌లు రానున్నాయి. వీటితో పాటు 'సమ్మర్ ఆఫ్ 76', 'సివిల్ లైన్స్', 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ 2', 'గుల్లక్ 5', 'ఉందేఖి 4', '13th' వంటి సిరీస్‌లు కూడా ఉన్నాయి.
ప్రాంతీయ భాషల్లో కొత్త సిరీస్‌లు:
తెలుగు ప్రేక్షకులకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జగపతి బాబు నటించిన 'బ్లాక్ & వైట్', త్రిష కృష్ణన్, రవీంద్ర విజయ్ నటించిన 'బృందా 2' సిరీస్‌లు రానున్నాయి. తమిళంలో ప్రభుదేవా ఓటీటీ అరంగేట్రం చేస్తున్న 'సేతురాజన్ ఐపీఎస్', 'ది మద్రాస్ మిస్టరీ'తో పాటు 'కుట్రమ్ పురింధవన్', 'తీవినై పొట్రు', 'ఫ్రీ లవ్' సిరీస్‌లు ఉన్నాయి. మలయాళంలో 'బ్లైండ్‌ఫోల్డ్', 'ఐస్', 'అన్‌ఫెయిర్' అనే సిరీస్‌లు, బెంగాలీలో 'జాజ్ సిటీ', మరాఠీలో 'మాన్వత్ మర్డర్స్ 2' సిరీస్‌లు విడుదల కానున్నాయి.
రియాల్టీ షోలు, స్పోర్ట్స్:
'మిలియన్ డాలర్ లిస్టింగ్ ఇండియా 2', 'మాస్టర్ చెఫ్ ఇండియా', 'షార్క్ ట్యాంక్ ఇండియా 5' వంటి రియాల్టీ షోలు కొత్త సీజన్‌లతో తిరిగి వస్తున్నాయి. క్రీడల విషయానికి వస్తే, సోనీ లివ్ లో ఆసియా కప్ 2025, యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎఫ్‌సీ, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత క్రికెట్ జట్ల పర్యటనలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.