భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. తన అన్న స్నేహాశిష్ గంగూలీ స్థానాన్ని సౌరవ్ భర్తీ చేయనున్నారు. గంగూలీ ప్యానెల్‌లో నితీష్ రంజన్ దత్తా ఉపాధ్యక్షుడు, బబ్లు కోలే కార్యదర్శి, మదన్‌మోహన్ ఘోష్ సహాయ కార్యదర్శి, సంజయ్ దాస్ ట్రెజరర్‌గా ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా రేసులో ఉన్నాడని టాక్ నడుస్తోంది.