భారత మహిళల క్రికెట్ జట్టు 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమ్‌ఇండియా ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సాధించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని గుర్తుగా, హర్మన్‌ప్రీత్ తన చేతిపై వరల్డ్ కప్ టాటూ వేయించుకుంది. అందులో గెలిచిన సంవత్సరం (2025), పరుగుల వ్యత్యాసం (52) కూడా ఉన్నాయి. ఈ విజయం తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుందని, తొలి రోజు నుంచి దీనికోసం ఎదురుచూశానని ఆమె పేర్కొంది.