గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి హీరోగా 'జూనియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సినిమాలో హీరోయిన్ శ్రీలీల, కీలకపాత్ర పోషించిన జెనీలియా, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్టేజీపై సందడి చేశారు. ఆ చిత్రంలోని ‘వైరల్ వయ్యారి’ సాంగ్‌కు డ్యాన్స్ చేసి అలరించారు. హీరో కిరీటి, యాంకర్ సుమ కూడా వారితో కలిసి స్టెప్పులేశారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 18న విడుదల కానుంది.