చెన్నైలోని కరూర్ లో టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందగా, 111 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు స్టాలిన్ ప్రభుత్వమే కారణమని టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము కోరిన ప్రాంతంలో కాకుండా చిన్న రోడ్డులో సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పడమే దీనికి కారణమని, విజయ్ పై కుట్ర పన్నారని వారు మండిపడుతున్నారు.