ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ రోబో శంకర్ (46) కన్నుమూశారు. సెప్టెంబర్ 17న సినిమా షూటింగ్ సెట్‌లో అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్నప్పటికీ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గతంలో జాండిస్‌తో బాధపడిన ఆయన కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. "మీరు నా తమ్ముడు. మీరు నన్ను వదిలి వెళ్లిపోతారా?" అంటూ కమల్ హాసన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. రోబో శంకర్ మృతదేహం చెన్నైలోని నివాసానికి తరలించగా, శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి.