అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లలో పావు శాతం కోత విధించింది. అయితే, ఈ ఏడాదిలో మరోసారి రేట్ల కోత ఉండబోదని ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ సూచనలు ఇవ్వడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీని ప్రభావంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 592.67 పాయింట్లు నష్టపోయి 84,404.46 వద్ద, నిఫ్టీ 176.05 పాయింట్లు నష్టపోయి 25,877.85 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 88.70గా ఉంది.