యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ తీరప్రాంతంలో ప్రమాదకర సముద్ర జీవులు ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ''పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్'' అని పిలవబడే ఈ జీవులు పెద్ద సంఖ్యలో అబెరావాన్ బీచ్, పెంబ్రోక్‌షైర్, గ్వినెడ్, ఆంగ్లెసీ తీరాల వద్ద ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. దీని కారణంగా పోర్ట్ టాల్బోట్ కోస్ట్‌గార్డ్ అధికారులు తక్షణ హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు వీటిని దగ్గరగా వెళ్లకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదని సూచించారు.