మనిషిలా దంతాలు కలిగిన వింత చేప

TG: నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో మన్మద్ గ్రామానికి చెందిన సంతోష్ అరుదైన చేపను పట్టాడు. మనిషి దంతాల్లా ఉండే ఆ చేప కేజిన్నర బరువు ఉందని తెలిపాడు. ఆ చేపను 'రూప్‌చంద్' లేదా 'చందువా'గా పిలుస్తారు. సాధారణంగా వీటికి పళ్లు ఉండవు కానీ అరుదుగా పిరానా జాతి బంధువుల కావడంతో పళ్లతో పుడుతాయి. వింత చేపను చూడటానికి జనం ఎగపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్