ప్రతిరోజు స్ట్రాబెర్రీలను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఒత్తిడి తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్న వృద్ధులు తింటే.. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి స్ట్రాబెర్రీలు ఎంతగానో తోడ్పడతాయి.