అక్టోబర్ 1 నుంచి రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మోసాలను అరికట్టేందుకు రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఆధార్ వెరిఫికేషన్ చేసిన ప్రయాణికులకే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రూల్ IRCTC వెబ్‌సైట్, యాప్‌లలో వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది తత్కాల్ బుకింగ్‌కు మాత్రమే ఉంది. రైల్వే కౌంటర్ల నుండి టిక్కెట్లు కొనే వారికి మాత్రం పాత విధంగానే ఉంటాయి.