హాస్టల్ గదిలో ఓ విద్యార్థి పై తోటి విద్యార్థులు దాడి చేసిన షాకింగ్ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. జునాగఢ్ లోని ఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ గదిలో ఓ స్టూడెంట్ ను అతడి సహచరులు విచాక్షణారహితంగా కొట్టారు. చెంపదెబ్బలు కొడుతూ కిందపడేసి కాలితో తన్నారు. ఈ ఘటన గత నెలలో జరగ్గా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.