బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

TG: బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలోని నూతనకల్(M)లో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తాళ్లసింగారం గ్రామానికి చెందిన పల్సా భిక్షం కుమారుడు గణేష్ (17) పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తనకు కొత్త బైక్ కొనివ్వాలని దసరా రోజు గణేష్ తల్లిదండ్రులను అడగగా.. వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన గణేష్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్