కేరళలోని తిరువనంతపురంలోని ప్రభుత్వ స్కూల్లో క్లాస్‌రూమ్‌లో ఓ విద్యార్థి పెప్పర్ స్ప్రే కొట్టడంతో 9 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఇంటర్వెల్ తర్వాత ఈ ఘటన జరిగినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. క్లాస్‌రూమ్‌కు పెప్పర్‌స్ప్రేను ఎందుకు తీసుకువచ్చారనే దానిపై స్కూల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.