AP: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి దాడి చేశాడు. గాజులదిన్నె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బసవరాజు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. విద్యార్థి హర్షవర్ధన్‌ను బడికి పంపాలని ఇటీవల బాలుడి తండ్రి రంగస్వామికి ఆయన సూచించారు. తన కుమారుడికి బడికి పిలుస్తావా అంటూ బసవరాజుపై రంగస్వామి కర్రతో దాడి చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడి తల, ముక్కు, చేతులకు గాయాలయ్యాయి. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.