అమెరికాలో విదేశీ విద్యార్థుల కొత్త వీసాలపై పరిమితులు రానున్నాయి. ఇప్పటి వరకు ఎఫ్-1, జే-1 వీసాలపై విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, ఇంటర్న్‌లు తమ చదువులు లేదా ప్రోగ్రామ్ పూర్తయ్యే వరకు ఉండే సౌకర్యం ఉండేది. అయితే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా ఈ సిస్టమ్‌లో మార్పులు చేస్తూ వీసాలకు పరిమిత గడువు విధించే ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై విదేశీ విద్యార్థులు గరిష్టంగా నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండలేరు.