మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీ వద్ద ఇద్దరు బీసీఏ విద్యార్థులు పరీక్షల వాయిదా కోసం ప్రిన్సిపాల్ డాక్టర్ అనామిక జైన్ మరణించారని సోషల్ మీడియాలో నకిలీ ప్రచారం చేశారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో జరిగాల్సిన సమగ్ర మూల్యాంకన పరీక్షలు వాయిదా పడినట్లు చెబుతూ కాలేజీ లెటర్‌హెడ్ ఫార్మాట్‌లో లేఖ సృష్టించారు. ప్రచారం వైరల్ అవ్వడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో విద్యూర్థులే ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు.