సుహాస్‌ సినిమా షూటింగ్‌.. సముద్రంలో పడవ బోల్తా (వీడియో)

చెన్నై సముద్ర తీరంలో ‘మండాడి’ సినిమా చిత్రీకరణ సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు, కెమెరాలు నీట మునిగాయి. సినిమా యూనిట్ వెంటనే స్పందించి ఇద్దరినీ కాపాడింది. అయితే, కెమెరాలు, ఇతర సామగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి. మతిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో వెట్రిమారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాస్‌, సూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్