డిజిటల్‌ అరెస్టు మోసాలపై సుప్రీం కోర్టు ఆందోళన

సైబర్ నేరగాళ్లు "డిజిటల్ అరెస్ట్" అని భయపెడుతూ పెద్ద మొత్తంలో సొమ్ము కాజేస్తున్నారు. తాజాగా హరియాణా అంబాలా వాసి 73 ఏళ్ల మహిళ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ అని చెప్పి, సుప్రీం కోర్టు ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నాం అని నమ్మించి, నకిలీ పత్రాలు చూపించి రూ.1 కోటి లంచం కోరారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ న్యాయమూర్తులు దీనిపై ఆందోళన చెందారు. ఇది తీవ్రమైన మోసం అని పేర్కొంటూ.. కేంద్రం, సీబీఐలను స్పందించమని సుప్రీం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్