గ్రూప్ 1 లో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట

తెలంగాణ గ్రూప్‌-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా.. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిచడంపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

సంబంధిత పోస్ట్