అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌరవిమానయాన శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రమాదంపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. విచారణను వేగవంతం చేయాలని తెలిపింది. విచారణను పారదర్శకంగా జరపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.