కుమార్తె పెళ్లి కోసం తండ్రి భూమి అమ్మకం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కుమార్తె వివాహ ఖర్చుల కోసం 1995లో తన భూమిని అమ్మివేసిన తండ్రి చర్యను ప్రశ్నిస్తూ పెద్ద కుమారుడు దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ అవిభాజ్య కుటుంబ చట్టం ప్రకారం, కుటుంబ కర్తగా తండ్రికి నిజమైన కుటుంబ అవసరాల కోసం ఆస్తిని విక్రయించే సర్వహక్కులు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. తండ్రి మద్యపానానికి బానిసై భూమిని అమ్మాడని కుమారుడు చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపకపోవడంతో, అతని దావాను కోర్టు కొట్టివేసింది.

సంబంధిత పోస్ట్