అశ్లీల కంటెంట్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పెరుగుతున్న అశ్లీల కంటెంట్‌పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సీజేఐ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్‌లో సైట్ల నిషేధం వల్ల జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, ఈ పిటిషన్‌ను వెంటనే విచారించలేమని, నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నామని తెలిపింది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వాడకం పెరిగిందని, ఐటీ యాక్ట్‌లోని 69A ప్రకారం అశ్లీల కంటెంట్‌పై నిషేధం విధించే అవకాశం ఉన్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్