సురవరం సుధాకర్ రెడ్డి రాజకీయ నాయకుడే కాకుండా.. పాత్రికేయుడు, సామాజిక కార్యకర్తగా కూడా విశేష సేవలందించారు. ఆయన విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఎడిటోరియల్ బోర్డ్ చైర్మన్‌గా, పలు తెలుగు పుస్తకాలు, విశాలాంధ్ర దినపత్రిక, యువజన తెలుగు మాసపత్రిక, యూత్ లైఫ్, న్యూ జనరేషన్ (ఇంగ్లీష్ వీక్లీ) పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. సీఐఏ, నిరుద్యోగం వంటి అంశాలపై పుస్తకాలు ప్రచురించిన ఆయన.. అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని, ప్రజా ఉద్యమాలను నిర్వహించారు.