పహల్‌గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. "పహల్‌గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు మేం అండగా నిలుస్తాం. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. నేటి విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేయాలనుకుంటున్నాం" అని మ్యాచ్ అనంతరం సూర్య పేర్కొన్నాడు. టీమిండియా పాక్ మీద విజయం సాధించిన ఈ రోజే (సెప్టెంబర్ 14) టీ20 జట్టు కెప్టెన్ సూర్య పుట్టిన రోజు కావడం విశేషం.
Credits: Sony Sports Network