ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజిలో పాక్‌పై టీమ్‌ఇండియా విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 14న విజయాన్ని ఫహల్గాం ఉగ్రదాడి బాధితులు, భారత సైనికులకు అంకితం చేశారని తెలిపిన సూర్యకుమార్ వ్యాఖ్యలను రాజకీయంగా మలిచినట్టు భావించారు. ఫలితంగా ఐసీసీ మ్యాచ్ ఫీజులో 30% కోత విధించారు. టోర్నీలో ఇకపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దని ఐసీసీ అతడికి సూచించింది.