భువనగిరి జిల్లా చందుపట్ల గ్రామంలో విషాదం జరిగింది. మనస్తాపం చెందిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన తోటకూరి మల్లమ్మ (62) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడి వద్ద ఉంటోంది. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొచ్చారు. అప్పుల వాళ్లు ఒత్తిడి తేవడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మనస్తాపానికి గురైన మల్లమ్మ శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.