బీబీనగర్: పెద్ద చెరువులో మృతదేహం లభ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్ద చెరువులో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీసి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్ సనత్ నగర్ కు చెందిన బైరి జగన్ (38) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్