చౌటుప్పల్: భారీ వర్షాలతో మునిగిన ఎంపీడీవో కార్యాలయం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద చెరువు నిండి అలుగు పారుతోంది. ఈ అలుగు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో 13వ వార్డు వినాయక నగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీడీవో కార్యాలయం, పాలశితలికరన కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం వంటి కీలక ప్రదేశాలలోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడి సేవలు నిలిచిపోయాయి. ఎంపీడీవో కార్యాలయంలోకి నీరు చేరడంతో కార్యకలాపాలు స్తంభించాయి.

సంబంధిత పోస్ట్