వలిగొండ: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

గొల్నేపల్లి గ్రామానికి చెందిన మంగళారపు మల్లా రెడ్డి (52) తన భార్య సునీత నాలుగేళ్ల క్రితం మరణించడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు ఫోన్ ద్వారా తెలిపారు. సోమవారం గోకారం గ్రామ పరిధిలో మల్లారెడ్డి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటన వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్