హుజూర్ నగర్ కు చెందిన సోమగాని నరేందర్ గౌడ్ కు ఓయు డాక్టరేట్ అవార్డు ప్రధానం చేసింది. ఆయన సోషియాలజీ విభాగంలో ప్రొఫెసర్ చింత గణేష్ పర్యవేక్షణలో 'పీపుల్స్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ పాజిబిలిటీస్ అండ్ హిండ్రాన్సెస్ - ఏ సోషియోలాజికల్ స్టడీ ఆఫ్ నల్లగొండ డిస్ట్రిక్ట్' అనే అంశంలో పరిశోధన చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.