అనంతగిరి మండలం గొండ్రియల, రంగాపురం గ్రామాల మధ్య పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం సరిహద్దు జిల్లాలోని ఈ ప్రాంతం నుండి పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వాగు నీరు బ్రిడ్జి పై నుండి ఉధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. గత ఏడాది ఇదే వాగులో వరద పోటెత్తి గ్రామం సగానికి పైగా నీట మునిగిపోయింది. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.