నడిగూడెంలో పెంపుడు కుక్క అకస్మాత్తుగా మరణించడంతో, పంచాయతీ సిబ్బందే దానిని చంపారనే అనుమానంతో వారిపై దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదైంది. జీపీ కార్యదర్శి ఉమ ఫిర్యాదు మేరకు, సిబ్బంది చిమట నాగరాజు, సుభాని, రామకృష్ణలపై దాడి చేసిన పల్లపు నాగేశ్వరరావు, తమ్మిశెట్టి గోవిందమ్మ, లలిత, దేవరంగుల శ్రీనులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.