కోదాడలోని ఎమ్మెస్ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ వేడుకలను కళాశాలల చైర్మన్ పందిరి నాగిరెడ్డి ప్రారంభించారు. బతుకమ్మ జీవితాన్ని ఆహ్వానించే పండుగ అని, ప్రకృతిని, పంటలను ఆరాధిస్తూ పార్వతీదేవిని పూజిస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.